logo

జిన్నింగ్‌మిల్లులో అగ్నిప్రమాదం

రాయగడ జిల్లా రామన్నగుడ సమితి ఎదుర్లవలస జిన్నింగ్‌ మిల్లు (పత్తి మిల్లు)లో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Published : 07 Feb 2023 01:44 IST

పత్తి కుప్పల వద్ద కమ్ముకున్న పొగలు

గుణుపురం, నూస్‌టుడే: రాయగడ జిల్లా రామన్నగుడ సమితి ఎదుర్లవలస జిన్నింగ్‌ మిల్లు (పత్తి మిల్లు)లో సోమవారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రూ.కోట్ల విలువైన పత్తికి నష్టం వాటిల్లిందని సమాచారం. ఉదయం మిల్లు బయట ఉంచిన సరకు నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న గుణుపురం, గుమడా అగ్నిమాపక సిబ్బంది నాలుగైదు గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... 500 బేళ్ల పత్తి ఉంటుందని దగ్ధమైనట్లు తెలిసింది. మంటలకు కారణాలు తెలియరాలేదు.

మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని