logo

సృష్టి, స్థితి, లయలకు నిరాకార పరబ్రహ్మమే మూలాధారం

నిరాకార పరబ్రహ్మం సృష్టి, స్థితి, లయలకు మూలాధారమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు.

Published : 07 Feb 2023 01:44 IST

అలేఖ యోగులతో కలసి ప్రార్ధనలు చేస్తున్న ధర్మేంద్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: నిరాకార పరబ్రహ్మం సృష్టి, స్థితి, లయలకు మూలాధారమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ఢెంకనాల్‌ జిల్లా జొరొందా అలేఖ శూన్య బ్రహ్మ క్షేత్రంలో మహిమా యోగుల వారం రోజల మాఘమేళా, విశ్వశాంతి ప్రార్థనలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇక్కడే విడిది చేసిన ధర్మేంద్ర సోమవారం ఉదయం యోగులతో కలసి నిరాకార పరబ్రహ్మ ప్రార్ధనలు చేశారు. వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సర్వసంఘ పరిత్యాగులైన అలేఖ సిద్ధ యోగులు దేశవ్యాప్తంగా సంచరిస్తూ మతసామరస్యం, సద్భావన పెంపొందిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనలు చిగురింపజేస్తున్నారన్నారు. ఢెంకనాల్‌లోని ఈ చారిత్రక, ధార్మిక క్షేత్రం పవిత్రతకు నిలువుటద్దమని పేర్కొన్నారు. మాఘమేళా పూర్ణాహుతిలో పాల్గొన్న ధర్మేంద్ర యోగులతో కలసి అలేఖ కీర్తనలు ఆలపించారు.

ఆశీస్సులందుకుంటున్న కేంద్ర మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని