logo

చద్దన్నం ప్లేటు ధర రూ. 900

రాష్ట్రంలో సోమవారం ప్రజలు చద్దన్నం దినోత్సవం నిర్వహించుకున్నారు. వీధుల్లో యువజన సంఘాలు దీంతోనే విందు చేసుకున్నారు.

Published : 21 Mar 2023 03:16 IST

కటక్‌ పంథోనివాస్‌లో చద్దన్నం తింటున్న వ్యక్తులు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సోమవారం ప్రజలు చద్దన్నం దినోత్సవం నిర్వహించుకున్నారు. వీధుల్లో యువజన సంఘాలు దీంతోనే విందు చేసుకున్నారు. భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో సాధారణ ప్రజలతో కలిసి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, శాసనసభ్యుడు సురేష్‌ రౌత్రాయ్‌ చద్దన్నం ఆరగించారు. మరోవైపు భువనేశ్వర్‌లోని ఒక స్టార్‌ హోటల్‌లో సోమవారం ప్లేటు చద్దనాన్ని రూ.900ల చొప్పున విక్రయించారు. ఈ చద్దన్నంతోపాటు రొయ్యల వేపుడు, చేపల వేపుడు, మినప వడియాలు, పచ్చడి, బంగాళాదుంప పచ్చడి, తోటకూర వేపుడు వంటివి ఇచ్చారు. కటక్‌లోని పంథోనివాస్‌లో కూడా చద్దన్నం విక్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని