logo

పిచ్చుకల సంరక్షణ అందరి బాధ్యత

పిచ్చుకల సంరక్షణ బాధ్యత అందరిదని అతిథులన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక గణేష్‌ నగర్‌ ప్రాంతంలో చైతన్య సమావేశం నిర్వహించారు.

Published : 21 Mar 2023 03:16 IST

స్థానిక మహిళకు కృత్రిమ పిచ్చుక గూడు అందజేస్తున్న డీఎఫ్‌ఓ సన్నీ ఖొఖర్‌. చిత్రంలో అతిథులు, నిర్వాహకులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: పిచ్చుకల సంరక్షణ బాధ్యత అందరిదని అతిథులన్నారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక గణేష్‌ నగర్‌ ప్రాంతంలో చైతన్య సమావేశం నిర్వహించారు. ఆంచలిక వికాస్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో బ్రహ్మపుర సబుజ వాహిని సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రహ్మపుర అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) సన్నీ ఖొఖర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని పిచ్చుకల సంతతి పెంపు, వాటి సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. అతిథులుగా స్థానిక వార్డు కార్పొరేటరు సంతోష్‌ కుమార్‌ సెఠి, బ్రహ్మపుర అటవీ రేంజర్‌ రజత్‌ కుమార్‌ మిశ్ర పాల్గొన్నారు. ఆంచలిక వికాస్‌ పరిషత్‌ కార్యదర్శి బిజేంద్ర మాఝి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి బ్రహ్మపుర సబుజ వాహిని అధ్యక్షుడు శిబరాం పాణిగ్రహి, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం పలువురు స్థానికులకు అతిథులు కృత్రిమ పిచ్చుక గూళ్లు, ఫీడర్‌ సీసాలు, సిమెంట్‌ నీటి తొట్టెలు పంపిణీ చేశారు. తర్వాత అతిథుల సమక్షంలో వాటిని ప్రజల ఇళ్ల బయట అమర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని