logo

26 నుంచి భారీ వర్షాలకు అవకాశం

ఈ నెల 26వ తేదీ నుంచి 27 వరకు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధ్యయనశాఖ (ఐఎండీ) వర్గాలు తెలిపాయి.

Published : 24 Mar 2023 01:53 IST

8 జిల్లాలకు హెచ్చరిక

గాలివాన సూచనలున్న జిల్లాల వివరాలు మ్యాప్‌లో పసుపు రంగులో

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: ఈ నెల 26వ తేదీ నుంచి 27 వరకు విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ అధ్యయనశాఖ (ఐఎండీ) వర్గాలు తెలిపాయి. గురువారం గోపాల్‌పూర్‌ ఐఎండీ అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ... 25 నుంచి మళ్లీ పశ్చిమగాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో వాయుమండలంలో ఆవర్తనం ఏర్పడుతుందని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశం ఉందని, పూర్తి వివరాలు శనివారం తెలియజేస్తామన్నారు. ఈ నేపథ్యంలో గడిచిన 25 గంటల్లో కాలవైశాఖి ప్రభావంతో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిశాయన్నారు. బరగఢ్‌ జిల్లా గైసవేట్‌లో 3 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, మిగతాచోట్ల సాధారణంగా ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం కాలవైశాఖి ప్రభావంతో గజపతి, రాయగడ, కొరాపుట్‌, మల్కాన్‌గిరి, నవరంగ్‌పూర్‌, కొంధమాల్‌, మయూర్‌భంజ్‌, బాలేశ్వర్‌ జిల్లాల్లో గాలివానకు అవకాశం ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు చేసినట్లు దాస్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని