logo

సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారి అఖయ కుమార్‌ పట్నాయక్‌ చెప్పారు.

Published : 24 Mar 2023 01:53 IST

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి అఖయ కుమార్‌ పట్నాయక్‌, ఇతర అధికారులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారి అఖయ కుమార్‌ పట్నాయక్‌ చెప్పారు. గురువారం మధ్యాహ్నం జీబీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏర్పాట్ల గురించి వివరించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఈ నెల 25న (శనివారం) ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జీబీఏ కార్యాలయంలో పోలింగు నిర్వహిస్తామన్నారు. ఒక్కో పదవికి రెండేసి బ్యాలెట్‌ పెట్టెలు సిద్ధం చేశామన్నారు. ఆరు పోలింగు బూత్‌లు ఏర్పాటవుతాయన్నారు. మొత్తం, 1,516 మంది ఓటర్లున్నారని తెలిపారు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, పూర్తయిన వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో అభ్యర్థి తరఫున ఒక్కో ఏజెంటును పంపాలని తెలిపామన్నారు. పోలింగు, ఓట్ల లెక్కింపు తదితరాలు సజావుగా సాగేందుకు ముప్పై మంది సహాయ ఎన్నికల అధికారుల నియామకం జరిగిందన్నారు. పోలింగు రోజు జీబీఏ కార్యాలయంవైపు వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ను నియంత్రించాలని బ్రహ్మపుర ఎస్పీకి లేఖ రాసినట్లు ఎన్నికల అధికారి పట్నాయక్‌ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో సహాయ ఎన్నికల అధికారులు నయనచంద్ర మహాపాత్ర్‌, శిశిర్‌కుమార్‌ భల్‌, తాజా మాజీ కార్యదర్శి సుశీల్‌కుమార్‌ త్రిపాఠి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని