logo

పరుగుపందెంలో కానిస్టేబుల్‌ అభ్యర్థి మృతి

దేశానికి సేవ చేయడం కోసం ఆర్మీలో చేరాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు.కానిస్టేబుల్‌ ఉద్యోగం చేసైనా సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు.

Published : 26 Mar 2023 03:27 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీప్తిరంజన్‌ దాస్‌

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: దేశానికి సేవ చేయడం కోసం ఆర్మీలో చేరాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు.కానిస్టేబుల్‌ ఉద్యోగం చేసైనా సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తర్వాత దేహదారుఢ్య పరీక్షలకు వచ్చిన అభ్యర్థికి కాలం అనుకూలించలేదు. పరుగు పందెంలో పాల్గొన్న ఆయన స్పృహ కోల్పోయి మృతి చెందిన ఘటన ఇది. గంజాం జిల్లా ఛత్రపురంలోని పోలీసు మైదానంలో శుక్రవారం కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో భాగంగా దేహదారుఢ్య పరీక్షల్లో పరుగెత్తుతూ దీప్తిరంజన్‌ దాస్‌ (23) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆయనను ఛత్రపురం ఆసుపత్రిలో తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఎమ్కేసీజీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం..  దీప్తిరంజన్‌దాస్‌ గంజాం జిల్లా కళ్లికోటలోని శ్యాంసుందర్‌పూర్‌ గ్రామానికి చెందినవాడు. తండ్రి హరిహరదాసు దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడు దీప్తిరంజన్‌దాస్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని