logo

అయిదు జిల్లాల్లో అధిక ప్రభావం: ఐఎండీ

పశ్చిమ గాలుల ప్రభావంతో ఆదివారం ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా, తీర జిల్లాల్లో కాలవైశాఖి (థండర్‌ స్టార్మ్‌) వర్షాలు కురుస్తాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం(ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ శనివారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Published : 26 Mar 2023 03:27 IST

సోమవారం వరకు వడగళ్ల వానకు అవకాశం ఉన్న జిల్లాల వివరాలు (మ్యాప్‌లో పసుపురంగులో)

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: పశ్చిమ గాలుల ప్రభావంతో ఆదివారం ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశా, తీర జిల్లాల్లో కాలవైశాఖి (థండర్‌ స్టార్మ్‌) వర్షాలు కురుస్తాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం(ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ శనివారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. కొరాపుట్‌, రాయగడ, గజపతి, మయూరభంజ్‌, కేంఝర్‌ జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న అంచనా ఉందని స్పష్టం చేశారు. ఈ అయిదు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. రాష్ట్రంపై 28 వరకు కాలవైశాఖి ప్రభావం ఉంటుందని, 27న 13 జిల్లాల్లో ఉరుములతో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పలుచోట్ల వడగళ్లు పడే అవకాశం ఉందని తెలిపారు. గడిచిన 24 గంటల్లో రాయగడ జిల్లా గుడారిలో 3 సెం.మీ, బాలేశ్వర్‌ జిల్లా సొరొలో 2సెం.మీ, భద్రక్‌ జిల్లా బాసుదేవపూర్‌లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం పడగా, మిగతా చోట్ల సాధారణ జల్లులు కురిసినట్లు దాస్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని