logo

సజావుగా జీబీఏ ఎన్నికలు

ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలకు శనివారం నిర్వహించిన పోలింగు ప్రశాంతంగా జరిగింది.

Published : 26 Mar 2023 03:27 IST

పోలింగును పర్యవేక్షిస్తున్న ఎన్నికల అధికారి అఖయ కుమార్‌ పట్నాయక్‌. చిత్రంలో సహాయ ఎన్నికల అధికారులు, ఇతరులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ప్రతిష్ఠాత్మక ‘గంజాం న్యాయవాదుల సంఘం’ (జీబీఏ) కొత్త కార్యవర్గం ఎన్నికలకు శనివారం నిర్వహించిన పోలింగు ప్రశాంతంగా జరిగింది. స్థానిక జిల్లా జడ్జి కోర్టు సమీపంలోని జీబీఏ కార్యాలయం సమావేశ మందిరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిర్వహించిన పోలింగులో పలువురు న్యాయవాదులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. న్యాయవాది అయిన బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి కూడా ఓటు వేశారు. ఎన్నికల అధికారి అఖయ కుమార్‌ పట్నాయక్‌తోపాటు మరో ముప్పై మంది సహాయ ఎన్నికల అధికారులు పోలింగు ప్రక్రియ పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది.

అంతటా ప్రశాంతం.. కటక్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో న్యాయవాదుల సంఘాలకు శనివారం నిర్వహించిన ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. 133 సంఘాలకు ఎన్నికలు జరగ్గా రాష్ట్రవ్యాప్తంగా 33 వేల మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. కటక్‌లో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి నలుగురు, కార్యదర్శి పదవికి 13 మంది పోటీలో ఉన్నారు.

ఓటు హక్కు వినియోగించుకుంటున్న న్యాయవాదులు. ఓటు వేసేందుకు నిల్చున్న బీఈఎంసీ మేయరు సంఘమిత్ర దొళాయి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని