logo

108 మంది దంపతులకు పునర్వివాహాలు

సమాజంలో కులం పేరిట వేళ్లూనుకున్న దురాచారాలను చక్కదిద్దేందుకు ‘అగ్నికుల క్షత్రియ మహామండల సంఘం’ గంజాం జిల్లా వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Published : 26 Mar 2023 03:27 IST

హిందూ సంప్రదాయం ప్రకారం సంస్కరణలు జరిపి, హోమాలు నిర్వహించి పెళ్లిళ్లు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: సమాజంలో కులం పేరిట వేళ్లూనుకున్న దురాచారాలను చక్కదిద్దేందుకు ‘అగ్నికుల క్షత్రియ మహామండల సంఘం’ గంజాం జిల్లా వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టి అందరి ప్రశంసలు అందుకుంటోంది. గతంలో కులాంతర వివాహాలు చేసుకున్నారన్న కారణంతో దూరంగా ఉంచిన అగ్నికుల క్షత్రియ దంపతులకు హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహాలు చేయించి కులంలో చేర్చుకుంది. గంజాం జిల్లా చికిటి సమితిలో గిరిసొలలోని పోలేరమ్మతల్లి మందిరం శ్రీచక్రవాహిని ఆవరణలో శుక్రవారం నిర్వహించిన వివాహ వేడుకల్లో 108 మంది దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా వారికి వివాహాలు చేయించిన నిర్వాహకులు వేలాది మందికి విందు భోజనాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సుమారు యాభై గ్రామాలకు చెందిన వారికి ఈ పెళ్లిళ్లు చేయించామని, వీరిలో అయిదేళ్ల నుంచి నలభై ఏళ్ల కిందట పెళ్లయిన వారు కూడా ఉన్నారని నిర్వాహక సంఘం గంజాం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగరాజు శనివారం రాత్రి ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

ఘనంగా 7వ మహాసభలు... సంఘం ఆధ్వర్యంలో ఇదే ఆవరణలో 7వ మహాసభలు శనివారం ఘనంగా నిర్వహించారు అగ్నికుల క్షత్రియులైన ప్రతిభ గల విద్యార్థులు, క్రీడాకారులు, మంచి ఉద్యోగాలు సాధించిన వారు, రాజకీయాల్లో రాణిస్తున్న సుమారు వంద మందికి మహాసభల్లో సన్మానించామని అధ్యక్షుడు నాగరాజు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని