logo

ముగిసిన న్యాయవాదుల సంఘం ఎన్నికలు

న్యాయవాదుల సంఘం ఎన్నికలు శనివారం  ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా ఆసక్తిని రేకెత్తించాయి.

Published : 26 Mar 2023 03:27 IST

పర్లాఖెముండిలో విజయసంకేతం చూపిస్తున్న అధ్యక్షుడు సిద్దేశ్వర మిశ్రా, సభ్యులు

న్యాయవాదుల సంఘం ఎన్నికలు శనివారం  ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా మరికొన్ని చోట్ల ఎన్నికలు ఎప్పుడూ లేనంతగా ఆసక్తిని రేకెత్తించాయి. గెలుపొందిన వారు విజయ సంకేతాలను చూపుతూ సంబరాలు చేసుకున్నారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

న్యూస్‌టుడే బృందం

* రాయగడ జిల్లా గుణుపురం పట్టణంలో కోశాధికారి స్థానానికి మినహాయించి మిగతా అన్ని స్థానాలకు పోటీ జరిగింది. అధ్యక్షుడిగా సీనియర్‌ న్యాయవాది ఉమాచరణ్‌ పట్నాయక్‌, ఉపాధ్యక్షుడిగా గణేశ్‌ సాహు గెలుపొందారు. కార్యదర్శి స్థానాన్ని విష్ణుచరణ్‌ పాఢి, సహ కార్యదర్శి స్థానాన్ని ఆర్‌డీ మిశ్ర కైవసం చేసుకున్నారు. కోశాధికారి పదవికి కైలాష్‌ సబర పోటీ లేకుండా విజయం సాధించారు. ఎన్నికల అధికారిగా సీనియర్‌ న్యాయవాది అక్షయశత్పథి ఉన్నారు.

* రాయగడ జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా న్యాయవాది దేవీప్రసాద్‌ పట్నాయక్‌ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పద్మనాభ దాస్‌, కార్యదర్శిగా విశ్వనాధ్‌ గంతాయత్‌, సహాయ కార్యదర్శిగా పల్లి రామకృష్ణ, కోశాధికారిగా దమయంతి మహానందియా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాజేంద్ర సేనాపతి తెలిపారు.

రాయగడలో నూతన కార్యవర్గ సభ్యులు

* పర్లాఖెముండి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా సిద్దేశ్వర మిశ్రా, కార్యదర్శిగా ఎం.పృథ్వీరాజ్‌ గెలుపొందారు. ఉపాధ్యక్షునిగా ఆర్‌.బాబూరావు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి కె.తాతయ్య వెల్లడించారు.

* సిమిలిగుడ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా సంతోష్‌ కుమార్‌ దాస్‌ గెలుపొందారు. ఎన్నికల అధికారిగా న్యాయవాది యుధిష్ఠిర్‌ ఉపాధ్యాయి వ్యవహరించారు. కార్యదర్శిగా విశ్వరంజన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

రాయగడ: గుణుపురం అధ్యక్షుడిగా ఉమాచరణ్‌ పట్నాయక్‌

* ప్రతిష్టాత్మకమైన ‘కొరాపుట్‌ న్యాయవాదుల సంఘం’ కొత్త కార్యవర్గం ఎన్నికలు శనివారం జయపురంలో జరిగాయి. అధ్యక్షుడిగా వీరేశ్‌ పట్నాయక్‌, ఉపాధ్యక్షుడిగా సహదేవ్‌ పట్నాయక్‌, కార్యదర్శిగా శరత్‌కుమార్‌ మాఝి గెలిచారు.

గుణుపురం సంఘ కార్యదర్శిగా విష్ణుపాఢి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని