logo

దాహం.. దాహం..

వేసవి రాకముందే కొరాపుట్‌ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బొయిపరిగూడ సమితి దండబాడి పంచాయతీ భల్లూజాత గ్రామంలో తాగునీటి సరఫరాకు మంచి నీటి పథకాలు, పైపు లైన్లు లేకపోవడం, ఉన్న ఒక్క బోరుబావి మరమ్మతులకు గురి కావడంతో ప్రజలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాపబంధ గ్రామానికి వెళుతున్నారు.

Published : 27 Mar 2023 01:58 IST

2 కిలోమీటర్ల దూరం నుంచి నీరు తీసుకొస్తున్న మహిళలు

జయపురం, న్యూస్‌టుడే: వేసవి రాకముందే కొరాపుట్‌ జిల్లాలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. బొయిపరిగూడ సమితి దండబాడి పంచాయతీ భల్లూజాత గ్రామంలో తాగునీటి సరఫరాకు మంచి నీటి పథకాలు, పైపు లైన్లు లేకపోవడం, ఉన్న ఒక్క బోరుబావి మరమ్మతులకు గురి కావడంతో ప్రజలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాపబంధ గ్రామానికి వెళుతున్నారు. సన్నగా ఒక గొట్టము నుంచి పడుతున్న మురుగనీటిని వినియోగిస్తున్నారు.  దీంతో గ్రామానికి చెందిన పలువురు నిత్యం జ్వరం, అతిసారం వంటి రోగాల బారిన పడుతున్నారు. ఈ విషయమై ‘న్యూస్‌టుడే’ సమితి అభివృద్ధి అధికారి అభిమన్యు కబి శత్పథి వద్ద ప్రస్తావించగా గ్రామ సభలు నిర్వహించి ఆయా పల్లెల్లో ఉన్న సమస్యలు నమోదు చేసుకుంటున్నామని, విడతల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు.

గుక్కెడు నీటి కోసం అవస్థలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని