logo

నేడు, రేపు భారీ వర్షాలు.. ఐఎండీ

రాష్ట్రానికి పశ్చిమ గాలుల తాకిడి ప్రారంభమైందని, దీంతో కాలవైశాఖి (థండర్‌ స్టార్మ్‌) ప్రభావం చూపనుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ఆదివారం ‘న్యూస్‌టుడే’ చెప్పారు.

Published : 27 Mar 2023 01:58 IST

మయూర్‌భంజ్‌ జిల్లాలో కురుస్తున్న వాన

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి పశ్చిమ గాలుల తాకిడి ప్రారంభమైందని, దీంతో కాలవైశాఖి (థండర్‌ స్టార్మ్‌) ప్రభావం చూపనుందని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ ఆదివారం ‘న్యూస్‌టుడే’ చెప్పారు. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్నారు. గడిచిన 24 గంటల్లో మయూర్‌భంజ్‌ జిల్లా మురుదాలో 5,  మల్కాన్‌గిరి జిల్లా పడియాలో 3, బాలేశ్వర్‌ జిల్లా రెమునాలో 3 సెంటీమీటర్ల వర్షం పడిందని, ఉత్తరకోస్తా, దక్షిణాదిలోని ఇతర కేంద్రాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్లు కురిసిందన్నారు. సోమవారం కేంఝర్‌, మయూర్‌భంజ్‌, జాజ్‌పూర్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, అనుగుల్‌, ఢెంకనాల్‌, రాయగడ, కొంధమాల్‌, గంజాం, గజపతి, నయాగఢ్‌, ఖుర్దా జిల్లాల్లో కాలవైశాఖి ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాతో ‘ఎల్లో’ హెచ్చరికలు జారీ చేశామన్నారు. కొన్ని చోట్ల వడగళ్లు పడతాయన్నారు. గాలివాన తీవ్రత మంగళవారం వరకు కొనసాగుతుందని దాస్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని