logo

ఉత్సాహం నింపిన ఉత్సవాలు

కటక్‌లో అంగరంగవైభవంగా జరుగుతున్న ఐక్యత రజతోత్సవాలు, జాతీయ సాంస్కృతికోత్సవాలు దేశంలో ఉన్న రాష్ట్రేతర తెలుగు వారిలో ఉత్సాహం నింపిందని రాతెస (రాష్ట్రేతర తెలుగు సమాఖ్య) అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు అన్నారు.

Published : 27 Mar 2023 01:58 IST

రా.తె.స. అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు

సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల తెలుగు సంఘాల ప్రతినిధులు

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌లో అంగరంగవైభవంగా జరుగుతున్న ఐక్యత రజతోత్సవాలు, జాతీయ సాంస్కృతికోత్సవాలు దేశంలో ఉన్న రాష్ట్రేతర తెలుగు వారిలో ఉత్సాహం నింపిందని రాతెస (రాష్ట్రేతర తెలుగు సమాఖ్య) అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు అన్నారు. రజతోత్సవాల సందర్భంగా కటక్‌ సరళ భవన్‌లో ఆదివారం జరిగిన రాతెస కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షించుకోవడం అవసరమని తెలిపారు. ఒడిశాలో కటక్‌ నగరంలో ఉంటూ తెలుగు భాషను కాపాండేందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. రాతెస కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఐక్యత ఉత్సవాలు దేశవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగువారి సమైక్యతకు అద్దం పట్టిందని పేర్కొన్నారు. రెండు రోజులుగా 14 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఆదివారం కార్యక్రమంలో మహారాష్ట్ర, పుణె నుంచి వచ్చిన కళాకారుల కోలాటం, నృత్యాలతోపాటు కవితాగానం, హాస్య కళాకారులు ప్రదర్శనలు అలరించాయి. ఐ.సుబ్రహ్మణ్యం పంచాంగం చదివి వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని