logo

జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు పతకాలు

బెంగళూరులో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయ ర్యాంకింగ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో రాష్ట్రానికి మరో మూడు పతకాలు సొంతమయ్యాయి.

Published : 27 Mar 2023 01:58 IST

పసిడి పతకాలతో సుమిత్ర మల్లిక్‌, టికిమోహిని మల్లిక్‌

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: బెంగళూరులో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయ ర్యాంకింగ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో రాష్ట్రానికి మరో మూడు పతకాలు సొంతమయ్యాయి. శనివారం సాయంత్రం నిర్వహించిన 59 కిలోల కేటగిరీలో సుమిత్ర మల్లిక్‌ స్నాచ్‌లో 54 కిలోలు, క్లీన్‌జర్క్‌లో 74 కిలోలు బరువులెత్తి మొదటిస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని దక్కించుకోగా,  64 కిలోల కేటగిరీలో టికిమోహిని మల్లిక్‌ పసిడి పతకం సొంతంచేసుకుంది. స్నాచ్‌ 65 కిలోలు, క్లీన్‌జర్క్‌ 84 కిలోలు బరువులెత్తి ఈ ఘనత సాధించింది. 54 కిలోల కేటగిరీలో బిధుస్మిత భొయి స్నాచ్‌లో 53 కిలోలు, క్లీన్‌జర్క్‌లో 66 కిలోలు బరువులెత్తి తృతీయస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒడిశా వెయిట్లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నారాయణ సాహు ఆదివారం ‘న్యూస్‌టుడే’కు ఈ వివరాలు తెలిపారు.

కాంస్యంతో బిధుస్మిత భొయి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని