logo

యజమానిని కాపాడిన పెంపుడు శునకం

కుక్కకి ఉన్న విశ్వాసం మనిషికి ఉండదనే మాటను ఓ పెంపుడు శునకం నిజం చేసింది. యజమానిని వాళ్ల కుటుంబ సభ్యులను పాము బారి నుంచి కాపాడింది.

Updated : 27 Mar 2023 11:48 IST

పాముకి అడ్డంగా నిలిచి..

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: కుక్కకి ఉన్న విశ్వాసం మనిషికి ఉండదనే మాటను ఓ పెంపుడు శునకం నిజం చేసింది. యజమానిని వాళ్ల కుటుంబ సభ్యులను పాము బారి నుంచి కాపాడింది. ఈ ఘటన మల్కాన్‌గిరి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం మల్కాన్‌గిరి పట్టణం, సరస్వతి శిశు విద్యామందిర్‌ సమీపంలో ఉంటున్న శివ ప్రసాద్‌ మాఝి అనే వ్యక్తి ఇంట్లో ఓ పాము ప్రవేశించింది. ఇంతలో ఆయన పెంచుకుంటున్న కుక్క పాముని చూసి దానిని ఇంటి లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని, గాయాలు చేసింది. కుక్క అరుపులు విని యజమాని, కుటుంబ సభ్యులు బయటికి వచ్చి కుక్క దగ్గర పాము ఉండడం గమనించారు. వెంటనే స్నేక్‌ హెల్ప్‌ లైన్‌కు సమాచారం అందించారు. వారు పాముని పట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు