logo

రేపు వడగళ్ల వర్షాలకు అవకాశం: ఐఎండీ

పశ్చిమ రాష్ట్రంలో ఈ నెల 31న గాలివాన తీవ్రత ఉంటుందని, కొన్నిచోట్ల వడగళ్ల వర్షాలు పడతాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ బుధవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Updated : 30 Mar 2023 06:38 IST

గురువారం వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాల వివరాలు (మ్యాప్‌లో పసుపురంగులో)

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: పశ్చిమ రాష్ట్రంలో ఈ నెల 31న గాలివాన తీవ్రత ఉంటుందని, కొన్నిచోట్ల వడగళ్ల వర్షాలు పడతాయని గోపాల్‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌ దాస్‌ బుధవారం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో పంటల సంరక్షణకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గడిచిన 24 గంటల్లో ఉత్తరకోస్తా, దక్షిణ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిశాయన్నారు. గురువారం కేంఝర్‌, మయూర్‌భంజ్‌, బాలేశ్వర్‌, భద్రక్‌, జాజ్‌పూర్‌, ఢెంకనాల్‌, కేంద్రపడ, కటక్‌, జగత్సింగ్‌పూర్‌, ఖుర్దా, పూరీ, గంజాం, కొంధమాల్‌ జిల్లాల్లో కాలవైశాఖి ప్రభావంతో గాలివానకు అవకాశం ఉన్నందున ‘ఎల్లో’ హెచ్చరికలు చేసినట్లు దాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని