logo

శ్రీక్షేత్రంలో రామనవమి వేడుకలు

పూరీ పురుషోత్తమ క్షేత్రంలో గురువారం రామనామం మార్మోగింది. భక్తులు జగన్నాథున్ని కోదండపాణి రూపంలో దర్శించుకొని ప్రార్థించారు.

Published : 31 Mar 2023 02:39 IST

 

పురుషోత్తముని దివ్యమంగళ రూపం

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: పూరీ పురుషోత్తమ క్షేత్రంలో గురువారం రామనామం మార్మోగింది. భక్తులు జగన్నాథున్ని కోదండపాణి రూపంలో దర్శించుకొని ప్రార్థించారు. శ్రీక్షేత్రంలో రామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచిన సేవాయత్‌లు జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో మంగళహారతి, మైలం, అబకాశ తదితర సేవలు నిర్వహించారు. 7 గంటలకు పురుషోత్తముని గోపాలవల్లభ సేవ తర్వాత స్వామికి రామావతారంలో అలంకరించి ప్రత్యేక సేవలు చేపట్టారు. మరోవైపు పూరీలో ‘సాహిజతొ’ (వీధి జాతరలు) పేరిట సేవాయత్‌ కుటుంబాల వారి పౌరాణిక వేషధారణల సందడి ప్రారంభమైంది. పౌర్ణమి వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. రామనవమి నుంచి రథం కలపకోత పనులకు శుభారంభం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని