logo

ఏప్రిల్‌ 4 నుంచి ఆసియా టెన్నిస్‌ పోటీలు

క్రీడల రాజధానిగా ఒడిశా రూపాంతరం చెందిందని, క్రీడా మైదానాలకు నూతన హంగులు కల్పిస్తున్నందున అంతర్జాతీయ క్రీడలకు రాష్ట్రం వేదికైందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు.

Published : 31 Mar 2023 02:39 IST

టెన్నిస్‌ కోర్ట్‌ ప్రారంభిస్తున్న నవీన్‌. పక్కన మంత్రి తుషారకాంతి, అధికారులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: క్రీడల రాజధానిగా ఒడిశా రూపాంతరం చెందిందని, క్రీడా మైదానాలకు నూతన హంగులు కల్పిస్తున్నందున అంతర్జాతీయ క్రీడలకు రాష్ట్రం వేదికైందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చెప్పారు. భువనేశ్వర్‌ కళింగ స్టేడియంలో కొత్తగా నిర్మాణమైన అత్యాధునిక టెన్నిస్‌ కోర్టును బుధవారం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని క్రీడలను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ ధ్యేయమని, ఈ దిశగా శిక్షణకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి తుషారకాంతి బెహరా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ జెనా, క్రీడలశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఆర్‌.వినీల్‌ కృష్ణ, రాష్ట్ర టెన్నిస్‌ సంఘం అధ్యక్షుడు అసిత్‌ త్రిపాఠి, 5-టీ కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టెన్నిస్‌ కోర్టులో ఏప్రిల్‌ 4 నుంచి 14 వరకు ఆసియా దేశాల అండర్‌-14 పోటీలు జరగనున్నాయి. 15 దేశాల క్రీడాకారులు పాల్గొననుండగా నవీన్‌ ‘లోగో’, జెర్సీలను ఆవిష్కరించారు. టెన్నిస్‌లో శిక్షణ పొందిన కొంతమంది క్రీడాకారులకు ప్రోత్సాహకంగా చెక్కులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని