logo

గంజాం జిల్లా తీరాన అరుదైన ‘గ్రీన్‌ సీ తాబేలు’

సముద్ర తాబేళ్లలో అరుదైన ‘గ్రీన్‌ సీ టర్టల్‌’ గంజాం జిల్లా రుషికుల్యా ముఖద్వారం తీరాన సందడి చేసింది.

Published : 31 Mar 2023 02:51 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: సముద్ర తాబేళ్లలో అరుదైన ‘గ్రీన్‌ సీ టర్టల్‌’ గంజాం జిల్లా రుషికుల్యా ముఖద్వారం తీరాన సందడి చేసింది. గంజాం సమితిలోని పోడమ్మపేట గ్రామం తీరానికి ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సాగర జలాల నుంచి ఇది వచ్చిందని బ్రహ్మపుర అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) సన్నీ ఖొఖర్‌ గురువారం సాయంత్రం ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. సుమారు రెండు గంటలు అది తీరాన తిరిగి, మళ్లీ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ సాగర తాబేలు పొడవు 1.45 మీటర్లు, వెడల్పు 88 సెంటీమీటర్లు ఉంది. బరువు సుమారు 140 కిలోల వరకు ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా తీరాన ఈ జాతి తాబేలు తొలిసారి కనిపించినట్లు అటవీ అధికారులు తెలిపారు. గంజాం జిల్లా తీరానికి దీర్ఘకాలంగా సముద్ర తాబేళ్లు ఆలివ్‌ రిడ్లీలు ఏటా భారీ సంఖ్యలో సామూహికంగా గుడ్లు పెట్టేందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని