logo

పెరగనున్న ఓంఫెడ్‌ పాల ధరలు

రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఓంఫెడ్‌)కు చెందిన పాల ధరలు ఇకపై పెరగనున్నాయి

Published : 31 Mar 2023 02:51 IST

రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 1 నుంచి అమలు

రాయగడ పట్టణం, కటక్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఓంఫెడ్‌)కు చెందిన పాల ధరలు ఇకపై పెరగనున్నాయి. వివిధ కేటగిరిల్లో ఉన్న 500 మి.లీ. ప్యాకెట్‌ ఒక్కింటికి రూ.2 చొప్పున ధర పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సవరించిన ధరలకు సంబంధించి సమాఖ్య బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్యాకింగ్‌, పశువుల దాణా, రవాణా తదితర నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పాల ధరలు పెంచాల్సి వస్తోందని స్పష్టం చేసింది. విక్రయాల ద్వారా వచ్చిన మొత్తంలో 90 శాతం ఖర్చు పాల సేకరణకు అవుతోందని వివరించింది. పాల ఉత్పత్తిదారులకు న్యాయమైన ధరలను సమకూర్చడంతోపాటు వినియోగదారులకు సరసమైన ధరలకు పాలను అందించడంలో ఓంఫెడ్‌ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించింది గత ఏడాది నుంచి పాల సేకరణకు ఎక్కువ ధరలు చెల్లిస్తున్నా వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పాల విక్రయ ధరలు పెంచలేదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని