logo

మరణంలోనూ వీడని బంధం

మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడచి జీవితాంతం కలసి ఉంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలు పాటిస్తూ కలసి జీవించిన ఆ దంపతులు మరణంలోనూ ఒకటిగా వెళ్లిపోయారు.

Updated : 26 May 2023 05:01 IST

 భర్త మృతి చెందిన 24 గంటల్లోపు భార్య మరణం

నరసింహం, లలిత (పాత చిత్రం)

రాయగడ, న్యూస్‌టుడే: మూడు ముళ్లు వేసి, ఏడడుగులు నడచి జీవితాంతం కలసి ఉంటానని పెళ్లినాడు చేసిన ప్రమాణాలు పాటిస్తూ కలసి జీవించిన ఆ దంపతులు మరణంలోనూ ఒకటిగా వెళ్లిపోయారు. పట్టణంలో సంతోషిమాత ఆలయ ప్రధాన అర్చకులుగా చివరి క్షణం వరకూ పనిచేసిన శ్రీపాద నరసింహం (69) గుండె పోటుతో మంగళవారం రాత్రి 9.30 గంటలకు రాణిగుడ ఫార్మ్‌లోని స్వగృహంలో మృతి చెందారు. బుధవారం సాయంత్రం సిరిగుడ స్వర్గధామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. భర్త మరణంతో కుంగిపోయిన ఆయన భార్య లలిత (59) ఆయన మరణించిన 24 గంటలు కాక ముందే బుధవారం రాత్రి 9 గంటలకు తుది శ్వాస విడిచారు. ఇద్దరి మరణం ఒకే సారి సంభవించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం ఆమె దహన సంస్కారాలు పూర్తి చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఉత్కళ ఆంధ్రా బ్రాహ్మణ సేవా సమాజం సభ్యులు, డైలీ మార్కెట్‌ వ్యాపారులు, సంతోషిమాత ఆలయ ట్రస్ట్‌ సభ్యులు సంతాపం తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని