logo

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘రక్షక్‌’: టుకుని సాహు

రాష్ట్రంలోని 314 సమితి కేంద్రాల్లో బస్టాండ్ల నిర్మాణాలు ప్రారంభించామని, 55 పూర్తి కాగా, 70 అసంపూర్తిగా ఉన్నాయని వాణిజ్య, రవాణాశాఖల మంత్రి టుకుని సాహు చెప్పారు.

Published : 26 May 2023 04:51 IST

మంత్రి టుకుని సాహు. పక్కన ఉషా పాఢి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 314 సమితి కేంద్రాల్లో బస్టాండ్ల నిర్మాణాలు ప్రారంభించామని, 55 పూర్తి కాగా, 70 అసంపూర్తిగా ఉన్నాయని వాణిజ్య, రవాణాశాఖల మంత్రి టుకుని సాహు చెప్పారు. గురువారం శాఖ పనితీరు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు వివరించిన తర్వాత ఆమె గీతగోవింద భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దశల వారీగా అన్ని పంచాయతీల్లో ‘మో బస్‌’ సేవలు ప్రారంభించాలని ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. రవాణాశాఖ కార్యాలయాల్లో అన్ని పనులు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని, పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా ‘రక్షక్‌’ కార్యక్రమం ప్రారంభించామని, ఇంతవరకు 30 వేల మందికి దీనిపై శిక్షణ ఇచ్చామని వివరించారు. భారీ వాహన చోదకులకు జాజ్‌పూర్‌లో ప్రత్యేక శిక్షణ కేంద్రం ప్రారంభించామన్నారు. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కి విమానసేవలు ప్రారంభం అయ్యాయని, త్వరలో సింగపూర్‌, బ్యాంకాక్‌లకు ఉడాన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. గోపాల్‌పూర్‌ పరిధిలోని రొంగాయిలొండ ఎయిర్‌ స్ట్రిప్‌ను విమానాశ్రయంగా విస్తరించడానికి పనులు ముమ్మరంగా జరుగుతున్నట్లు టుకుని చెప్పారు. సమావేశంలో రవాణాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఉషా పాఢి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు