logo

గుంత నీరే.. తాగు నీరు

దేశవ్యాప్తంగా అత్యధిక నీటి వనరులు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఒడిశా నాలుగో స్థానంలో నిలిచింది. సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ దానిని వినియోగించకోలేకపోవడంతో పలు గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి.

Published : 03 Jun 2023 02:49 IST

గుంతలో నీటిని సేకరిస్తున్న మహిళలు

జయపురం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా అత్యధిక నీటి వనరులు కలిగిన రాష్ట్రాల జాబితాలో ఒడిశా నాలుగో స్థానంలో నిలిచింది. సమృద్ధిగా నీటి వనరులు ఉన్నప్పటికీ దానిని వినియోగించకోలేకపోవడంతో పలు గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇంటింటికీ కొళాయి ఏర్పాటుకు వసుధ పథకం అమలు చేసినా.. దాని ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు అందడం లేదు. దీని వల్ల వేసవిలో తాగునీటికి ప్రజలు కటకటలాడుతున్నారు. కుంటలు, చెరువులు, గుంతల్లో కలుషిత నీరు తాగి రోగాల బారిన పడుతున్నారు. తాగునీరు కోసం ప్రయాస పడుతూ దూర ప్రాంతాలకు నడిచి వెళుతున్నారు. కొరాపుట్‌ జిల్లా బొయిపరిగూడ సమితి హల్దికుంట పంచాయతీ ముర్జాచువా గ్రామస్థులు గుంతలో నీరు వాడుతున్నారు. కొళాయిలు, బోరుబావులు, బావులు లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న సొరిసపొదర గ్రామంలో ఉన్న గుంల్లో నీటిని తోడి తెచ్చుకుంటున్నారు. ఈ నీరు వినియోగిస్తూ అనారోగ్యానికి గురవతున్నారు. అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నా.. స్పందన లేదని వాపోతున్నారు. మంచినీటి సమస్య పరిష్కరించకుంటే ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ సమితి అభివృద్ధి అధికారి అభిమన్యు కబి శత్పథి వద్ద ప్రస్తావించగా.. నీటి వనరులశాఖ ఇంజినీర్‌కు ఇది వరకే చెప్పామని, త్వరలో అక్కడ  సమస్య పరిష్కారమవుతుందని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని