logo

నాటు పడవలు బోల్తా : ఒకరి మృతి.. మరొకరి గల్లంతు

మల్కాన్‌గిరి ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో  సతిగుడ జలాశయంలో రెండు నాటు పడవలు మునిగి ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కాగా వారిలో ఒకరు విగతజీవిగా తేలాడు..

Published : 03 Jun 2023 02:49 IST

సతిగుడ జలాశయం వద్ద గుమిగూడిన ప్రజలు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆ సమయంలో  సతిగుడ జలాశయంలో రెండు నాటు పడవలు మునిగి ఇద్దరు మత్స్యకారులు గల్లంతు కాగా వారిలో ఒకరు విగతజీవిగా తేలాడు.. వివరాల్లోకి వెళ్తే.. సాయంత్రం మల్కాన్‌గిరి సమితి భీమారంగిణి గ్రామానికి చెందిన తులసాముడి(35), ఎం.వి.111 గ్రామానికి చెందిన గోవింద సర్దార్‌  వేర్వేరు పడవల్లో చేపల వేటకు జలాశయంలోకి వెళ్లారు. పెనుగాలులతో పాటు వర్షం కురవడంతో రెండు పడవలు అదుపు తప్పి నీటిలో మునిగి పోయాయి. దీన్ని స్థానికులు గమనించి గాలించినా ఫలితం లేకపోయింది. ఈ విషయం తెలిసి సింధ్రిముల సర్పంచి ఘనీ నాయక్‌ అక్కడికి చేరుకొని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అప్పటికే చీకటి పడడంతో శుక్రవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది జలాశయంలో గాలింపు ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో విగతజీవిగా తేలిన తులసా మాఝిను వెలికితీశారు. ఇతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా గోవింద సర్దార్‌ జాడ దొరక్కపోవడంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని