సత్తా చాటిన బస్తీ బాలిక
భువనేశ్వర్‌లోని బస్తీలో ఉంటున్న బాలిక ఇటీవల విడుదలైన ప్లస్‌టు సైన్స్ ఫలితాల్లో భువనేశ్వర్‌లో టాపర్‌గా నిలిచింది.
ప్లస్‌టులో భువనేశ్వర్‌కే టాపర్
ఈటీవీ భారత్‌తో మాట్లాడుతున్న వర్షారాణి స్వయిన్
భువనేశ్వర్ అర్బన్, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని బస్తీలో ఉంటున్న బాలిక ఇటీవల విడుదలైన ప్లస్‌టు సైన్స్ ఫలితాల్లో భువనేశ్వర్‌లో టాపర్‌గా నిలిచింది. ఈ ఘనత పొందిన ఆమెను ఉపాధ్యాయులతో పాటు స్థానికులు అభినందిస్తున్నారు. బెహరా సాహిలో ఉంటున్న సంతోష్ కుమార్ స్వయిన్ కుమార్తె వర్షా రాణి. ప్లస్‌టులో 600 మార్కులకు గాను 564 మార్కులు తెచ్చుకుంది. అరకొర వసతులతో జీవిస్తున్న ఆమెకు కార్యసాధనలో అవేవీ అడ్డంకిగా మారలేదు. దివ్యాంగుడైన తండ్రి సంతోష్ కుమార్ స్థానికంగా ఎలక్ట్రికల్ పనులు చేస్తూ వచ్చిన సంపాదనతో కొడుకు, కుమార్తెను చదివిస్తున్నాడు. వర్షా రాణి ‘ఈ టీవీ భారత్’తో మాట్లాడుతూ... భువనేశ్వర్‌లో బీజేబీ ఉన్నత సెకండరీ పాఠశాలలో చదువుతూ పరీక్షలు రాసినట్లు తెలిసింది. ఒత్తిడిని జయించి చదవడంతో మంచి ఫలితం సాధించినట్లు పేర్కొంది. సందేహాలను ఆన్‌లైన్ ద్వారా తీర్చుకున్నట్లు వివరించింది. రోజుకు 10 నుంచి 12 గంటలు చదువు కోసం కేటాయించినట్లు చెప్పిన వర్షా తాను ఈ ఘనత సాధించడంలో తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని వెల్లడించింది. వైద్యురాలు కావడమే తన లక్ష్యమని ఆమె పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?