logo

వేర్వేరు చోట్ల భారీగా గంజాయి స్వాధీనం

అబ్కారీ, పోలీసు అధికారుల తనిఖీల్లో పలుచోట్ల 190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్‌ జిల్లా జయపురం అబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ దుర్బదల్‌ బిశ్వాల్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి  కొట్పాడు సమితి మూర్తహండి రైల్వే టర్నల్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.

Published : 03 Jun 2023 02:49 IST

బొరిగుమ్మలో పట్టుకున్న గంజాయి, నిందితుడు

జయపురం, న్యూస్‌టుడే: అబ్కారీ, పోలీసు అధికారుల తనిఖీల్లో పలుచోట్ల 190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్‌ జిల్లా జయపురం అబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ దుర్బదల్‌ బిశ్వాల్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి  కొట్పాడు సమితి మూర్తహండి రైల్వే టర్నల్‌ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వీరిని గమనించి ముగ్గురు వ్యక్తులు రెండు వాహనాలను వదిలి పారిపోయారు. వాటిలో ఉన్న 70కిలోల గంజాయిని గుర్తించారు. జయపురం సమితి ఉమిరి రైల్వే స్టేషన్‌ వద్ద ముగ్గురు యువకులు ద్విచక్రవాహనాలపై వెళ్తుండగా ఆపి తనిఖీ చేయగా..లమత్‌పుట్‌ నుంచి దిల్లీకి తరలిస్తున్న 71కిలోల గంజాయి దొరికింది. దిల్లీకి చెందిన గోపాల్‌ కుమార్‌ సాహు, అజయ్‌కుమార్‌, మార్చ్‌ఖండ్‌కు చెందిన గణేష్‌(20)లను అరెస్టుచేసి గంజాయి, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం బొరిగుమ్మ అబ్కారీ ఇన్‌స్పెక్టర్‌ బిశ్వజిత్‌ పాణిగ్రహి ఆధ్వర్యంలో పాత బొరిగుమ్మ చౌక్‌ వద్ద తనిఖీల్లో.. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనాలను, 50 కిలోల గంజాయిని వదిలి పారిపోయారు. వీరిని త్వరలో పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ దుర్బదల్‌ తెలిపారు.


బలిగుడలో  402 కిలోలు..

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: కొంధమాల్‌ జిల్లా బలిగుడ ఠాణా పరిధిలో అక్రమ గంజాయి రవాణాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు గంజాయిని వదిలి పారిపోయారు. పోలీసులు 402 కిలోల 280 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారని కొంధమాల్‌ ఎస్పీ కార్యాలయం అధికారిక ట్విట్టర్‌లో శుక్రవారం పేర్కొంది.  గంజాం జిల్లా బెగునియాపడా ఠాణా పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఆరుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద ఉన్న రెండు సూట్‌కేసులు, గోనెల్లో 82 కిలోల 900 గ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు గంజాం ఎస్పీ కార్యాలయం అధికారిక ట్విట్టర్‌లో గురువారం రాత్రి తెలిపింది.


కనిమెలలో  504 కిలోలు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి జిల్లా కలిమెల పోలీసులు  504 కిలోల గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.  గురువారం కలిమెల ఠాణా పరిధిలోని కుర్మానూర్‌ పంచాయతీ కెందుగూడ సమీపాన అడవిలో గంజాయి అక్రమ రవాణా అవుతున్న సమాచారం అందుకొని పోలీసులు దాడులు చేశారు. అటవీ ప్రాంతంలో మొత్తం 20 బస్తాల్లో 504 కేజీల గంజాయి గుర్తించారు. అప్పటికే రవాణాదారులు అక్కడ నుంచి పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని