క్షతగాత్రులను పరామర్శించిన జయపురం ఎమ్మెల్యే
బాలేశ్వర్ జిల్లాలో బహనాగ గ్రామం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జయపురం ఎమ్మెలే తారాప్రసాద్ బాహినిపతి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శనివారం బాలేశ్వర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను సందర్శించి ఆహారాన్ని అందించారు.
చికిత్స పొందుతున్న యువకుడితో మాట్లాడుతున్న తారాప్రసాద్
జయపురం, న్యూస్‌టుడే: బాలేశ్వర్ జిల్లాలో బహనాగ గ్రామం వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జయపురం ఎమ్మెలే తారాప్రసాద్ బాహినిపతి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శనివారం బాలేశ్వర్ ఆసుపత్రిలో క్షతగాత్రులను సందర్శించి ఆహారాన్ని అందించారు. ప్రభుత్వం బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని కోరారు.
మృతులకు ఘన నివాళి
బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రైళ్ల దుర్ఘటనలో మృత్యువాత పడ్డ ప్రయాణికులకు శనివారం వివిధ సంస్థల ప్రతినిధులు నివాళులర్పించారు. స్థానిక బహుముఖి సమాజ మంగళ, సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో సాయంత్రం స్థానిక గాంధీనగర్ కూడలిలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. బ్రహ్మపుర ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోనూ గాంధీనగర్‌్ కూడలిలోని మధుసూదన్ దాస్ (మధుబాబు) విగ్రహం వద్ద మృతులకు నివాళులర్పించారు. ఎస్‌యూసీఐ (కమ్యూనిస్టు) గంజాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం కొమ్మాపల్లి కూడలి వద్ద మృతులకు నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత