logo

కొనసా...గుతున్న కారిడార్‌ పనులు

Published : 04 Jun 2023 02:21 IST

రథయాత్రలోగా పూర్తి అయ్యే అవకాశం తక్కువే

శ్రీక్షేత్రం పశ్చిమద్వారం వద్ద అసంపూర్తిగా పనులు

గోపాల్‌పూర్‌, న్యూస్‌టుడే: శ్రీజగన్నాథ్‌ కారిడార్‌ పనులు రథయాత్రలోగా పూర్తయ్యే అవకాశాలు దరిదాపుల్లో కనిపించడంలేదు. ఇంకా పనులు కొనసాగుతుండడంతో యాత్రంలోగా పూర్తి చేయాలన్న లక్ష్యం నీరుగారినట్లయింది.

2019లో నిర్మాణాలకు శ్రీకారం

నవీన్‌ పట్నాయక్‌ 2019 జులైలో శ్రీక్షేత్ర కారిడార్‌, శ్రీసేతు, ఒబడా ప్రాజెక్టుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. స్థల సేకరణ జరిగింది. పనుల ప్రారంభ దశలో కొవిడ్‌ విజృంభనతో అంతరాయం కలిగింది. గతేడాది రథయాత్ర ముందుగా నిర్మాణాలు ప్రారంభించారు. ఒడిశా బ్రిడ్జ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఓబీసీసీ) పర్యవేక్షణలో టాటా కన్‌స్ట్రక్షన్‌ సంస్థ కారిడార్‌ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. 2023 ఘోషయాత్ర ముందుగా నిర్మాణాలు పూర్తి చేయాలని పెట్టుకున్న అంచనా తలకిందులైంది. శ్రీక్షేత్ర ఉత్తర, దక్షిణ, పశ్చిమ ద్వారాలకు చేరువలో జరుగుతున్న కారిడార్‌ పనులు పూర్తయితే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తొలగుతాయి, రద్దీ నియంత్రించవచ్చు. ఆలయం ఆవరణలో భక్తులకు సౌకర్యాలు, ఆకర్షణీయమైన నిర్మాణాలు, కారిడార్‌ రోడ్డు పనులు జరుగుతున్నాయి.

లక్ష్యం నెరవేరలేదు

జూన్‌ 20న రథయాత్ర కాగా మే 30 నాటికి కారిడార్‌ పనలు పూర్తవుతాయని శ్రీక్షేత్ర పాలనాధికారి రంజన్‌ దాస్‌ లోగడ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంకా పనులు నడుస్తుండడంతో లక్ష్యం నెరవేరలేదు. పాలకవర్గం ప్రతినిధి మాధవచంద్రదాస్‌ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.... యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నా... రథయాత్రలోగా పూర్తయ్యే పరిస్థితి లేదని, మరికొంత వ్యవధి పడుతుందని చెప్పారు.

శ్రీసేతుదీ అదే పరిస్థితి

పూరీ బొడొదండొలో ట్రాఫిక్‌ నియంత్రణ ధ్యేయంగా చేపట్టిన శ్రీసేతు ప్రాజెక్టుదీ అదే పరిస్థితి. పూరీకి 6 కిలోమీటర్ల దూరంలోని మాలతీ పట్టపూర్‌ నుంచి మెట్రో తరహాలో రెండు వరుసల ఓవర్‌ లైను రోడ్డు పనులూ పూర్తి కాలేదు. దిగువలైను నిర్మాణం మాత్రమే సాధ్యమవుతుందని, పూరీ సబ్‌ కలెక్టరు భావతారణ సాహు విలేకరులకు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని