logo

నవజాత శిశువు మృతదేహం డ్రైయినేజీలో లభ్యం

ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణ బజారు ముఖ్య రహదారి ఆరోగ్య వీధి వెనుక భాగంలో ఉన్న డ్రైయినేజీలో నవజాత మగ శిశువు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది.

Published : 18 Sep 2023 10:38 IST

పర్లాఖెముండి  : ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణ బజారు ముఖ్య రహదారి ఆరోగ్య వీధి వెనుక భాగంలో ఉన్న డ్రైయినేజీలో నవజాత మగ శిశువు మృతదేహం సోమవారం ఉదయం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే పురపాలక కార్మికులు  డ్రైయినేజీ శుభ్రం చేస్తున్న సమయంలో ఓ సంచి లో శిశువు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నవజాత శిశువును ఎవరు,  ఎందుకు డ్రైయినేజీలో  వేశారనే దానిపై విచారణ జరుగుతోంది. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని