రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
కటక్ ట్రిగిరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త రోడ్డు జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
కటక్: కటక్ ట్రిగిరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త రోడ్డు జంక్షన్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుడు కటక్ ఎస్సీబీ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిందాని మార్గ గ్రామానికి చెందిన ఐదుగురు స్నేహితులు సోమవారం సాయంత్రం హనుస్పా సరస్సు వైపు కారులో బయలుదేరి వెళుతుండగా.. కొత్త రోడ్డు చౌక్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో చందన్ కట్టువ, సుభాష్ బెహరా, బాబులి రౌత్, సిల్లు ప్రుస్తి ఉన్నారు. గాయపడిన యువకుడు దీపక్ సాహు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘Bharat Dal’ brand: రాయితీపై శనగపప్పు.. ‘భారత్ దాల్’ కిలో రూ.60కే..
-
Art of Living: ‘ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు’.. ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు
-
Congress: కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్!
-
Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుల వాన
-
Weather Update: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
-
‘ప్రతిపక్ష అభ్యర్థులను పశువుల్లా కొన్నాం’