ఆ సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్లిందో?
వీరఘట్టం మహిళా పరస్పర గ్రామ సంఘం లిమిటెడ్-1 సభ్యులు చెల్లించిన చెక్కులకు సంబంధించి వైఎస్సార్ క్రాంతి పథం జిల్లా అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు.
వీరఘట్టం, న్యూస్‌టుడే: వీరఘట్టం మహిళా పరస్పర గ్రామ సంఘం లిమిటెడ్-1 సభ్యులు చెల్లించిన చెక్కులకు సంబంధించి వైఎస్సార్ క్రాంతి పథం జిల్లా అధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. అందులో సొమ్ము ఏమైందో తెలియడం లేదంటూ గతంలో స్పందనకు ఫిర్యాదులు వెళ్లాయి. మండల సమాఖ్య నుంచి 2009లో గ్రామ సంఘం రూ.5 లక్షలు అప్పు తీసుకుంది. చెల్లింపులకు సంబంధించి వీరఘట్టం ఏపీజీవీబీకి రూ.1,39,181 విలువైన 10 చెక్కులను అందజేశారు. దీనిలో ఓ చెక్కు మొత్తం రూ.13,418 చలివేంద్రి గ్రామ సంఘం ఖాతాకు జమవగా మిగిలిన రూ.1,25,763 ఏమయ్యాయో తెలియదు. విచారణ కమిటీ ఇదే విషయాన్ని గుర్తించింది. ఈ సొమ్ము వేరే సంఘాల ఖాతాల్లో జమైందా.. వ్యక్తిగత ఖాతాలకు వెళ్లిందో నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ సొమ్ము కాకుండా 2009 నుంచి గ్రామ సంఘం నుంచి బ్యాంకుకు ఇచ్చిన ఎస్‌జీఎస్‌వై చెక్కుల విలువ రూ.26,905 మొత్తాలకు లెక్క తేలాల్సి ఉందని విచారణకు వచ్చిన క్రాంతి పథం డీపీఎం(ఫైనాన్స్) జి.అప్పారావు, ఏపీఎంలు పి.సత్యనారాయణ, ఎం.ఆదియ్య తెలిపారు. విచారణలో స్థానిక ఏపీఎం బి.శివున్నాయుడు, సీసీ కుమారి, అకౌంటెంట్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP SI Posts: ఏపీలో ఎస్సై రాత పరీక్ష.. హాల్టిక్కెట్ల కోసం క్లిక్ చేయండి
-
Sports News
ASHWIN: ఇంతకీ అశ్విన్ బౌలింగ్ శైలి ఏంటి..? వైరల్‌గా మారిన ‘ఎడిటెడ్ బయో’
-
India News
American Airlines: సాయం కోరినందుకు క్యాన్సర్ రోగిని విమానం నుంచి దించేసిన సిబ్బంది!
-
World News
Pervez Musharraf: విమానంలో కూర్చొనే.. ప్రభుత్వాన్ని కూల్చిన ముషారఫ్!
-
Movies News
Allu arjun: అల్లు అర్జున్‌కు ‘పుష్ప’ లారీ గిఫ్ట్.. ఎవరిచ్చారో తెలుసా?
-
Sports News
IND vs AUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్.. దాని మీదనే మేం దృష్టిపెట్టాం: భారత కోచ్ ద్రవిడ్