logo

ఈ మొక్కలు ప్రాణాలు నిలుపుతాయా?

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పార్వతీపురం-కళింగపట్నం ప్రధాన రహదారి నీటితో నిండింది. ఎక్కడికక్కడ గుంతలుగా మారిన ఆ మార్గంపై నీరు

Published : 09 Aug 2022 05:36 IST

మొదటి చిత్రంలో కనిపిస్తున్న మొక్కలకు... రెండో దాంట్లో క్షతగాత్రుడిని తీసుకెళ్తున్న చిత్రానికి సంబంధం ఏమిటి?

వీటి గురించి ఎందుకు చెబుతున్నారని  అనుకుంటున్నారా? అక్కడికే వెళ్తున్నాం.

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పార్వతీపురం-కళింగపట్నం ప్రధాన రహదారి నీటితో నిండింది. ఎక్కడికక్కడ గుంతలుగా మారిన ఆ మార్గంపై నీరు నిలవడంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. సుమారు 10 కి.మీ. పొడవునా ఇదే పరిస్థితి. సోమవారం వీరఘట్టానికి  చెందిన ద్విచక్ర వాహనదారుడు గోతిలో పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతనికి స్థానికులు సపర్యలు చేసి, 108లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదాలు జరగకుండా గోతుల్లో మట్టి వేసి చెట్ల కొమ్మలను పాతారు. ఈ ఏడాది నిర్వహణ పనులు ప్రారంభిస్తే తోటపల్లి-కళింగపట్నం రోడ్డుకు ప్రాధాన్యమిస్తామని, ఈ లోగా గోతుల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటామని ర.భ శాఖ ఈఈ జేమ్స్‌ తెలిపారు.-న్యూస్‌టుడే, పార్వతీపురం, గరుగుబిల్లి గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని