logo

మాతాశిశు మరణాల అదుపునకు చర్యలు

ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించేలా క్షేత్రస్థాయి సిబ్బంది శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో జగన్నాథరావు ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని పీహెచ్‌సీల పరిధిలోని పీహెచ్‌ఎన్‌లు, ఏపీహెచ్‌ఈవోలు, ఎంపీహెచ్‌ఎస్‌లతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాతాశిశు మరణాల అదుపునకు

Published : 09 Aug 2022 05:36 IST

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో జగన్నాథరావు

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించేలా క్షేత్రస్థాయి సిబ్బంది శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో జగన్నాథరావు ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో అన్ని పీహెచ్‌సీల పరిధిలోని పీహెచ్‌ఎన్‌లు, ఏపీహెచ్‌ఈవోలు, ఎంపీహెచ్‌ఎస్‌లతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాతాశిశు మరణాల అదుపునకు అందరూ కృషి చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల నమోదు వంద శాతం జరగాలన్నారు. గర్భధారణ నుంచి బిడ్డ పుట్టే వరకు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో దుర్గా కల్యాణి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సందీప్‌, జగన్‌మోహన్‌, మాస్‌ మీడియా అధికారి వై.యోగేశ్వర రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని