logo

ప్రతి ఇంటిపై జెండా ఎగరాలి

మండలంలోని చినమేరంగిలో ఎంపీటీసీ మజ్జి పుణ్యవతి, సర్పంచి అల్లు రమణమ్మ, కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం చేపట్టారు. చినబజార్‌ నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో అందరూ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలన్నారు. బస్‌స్టేషన్‌ వద్ద మానవహారం చేపట్టారు.

Published : 09 Aug 2022 05:36 IST

విద్యార్థుల మానవహారం

జియ్యమ్మవలస, పార్వతీపురం పురపాలిక, కలెక్టరేట్‌ ప్రాంగణం, పాచిపెంట, సీతంపేట, న్యూస్‌టుడే: మండలంలోని చినమేరంగిలో ఎంపీటీసీ మజ్జి పుణ్యవతి, సర్పంచి అల్లు రమణమ్మ, కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం చేపట్టారు. చినబజార్‌ నుంచి బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 13, 14, 15 తేదీల్లో అందరూ ఇళ్లపై జెండాలు ఎగురవేయాలన్నారు. బస్‌స్టేషన్‌ వద్ద మానవహారం చేపట్టారు. * ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా తపాల శాఖ అదనపు ఎస్పీ శ్రీకర్‌బాబు పుర కమిషనర్‌ ఆనంద్‌ను కలిసి జాతీయ జెండాలు అందజేశారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అమ్మకాలు చేపట్టినట్లు తెలిపారు. *  క్విట్‌ ఇండియా స్ఫూర్తితో అందరూ ఏకం కావాలని సీపీఎం, సిటూ నాయకులు పార్వతీపురంలో ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులని పేర్కొన్నారు. *  పాచిపెంట జడ్పీ ఉన్నత పాఠశాలలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు సాలూరు పట్టణానికి చెందిన ‘మీకే మేము వెల్ఫేర్‌ అసోషియేన్‌’, స్థానిక గౌరమ్మ ఛారిటబుల్‌ ట్రస్టు దేశభక్తిపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు.  *  సీతంపేట మండలం పెద్దూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌ తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని