logo

ఖాళీ స్థలాలు.. రోగాలకు నిలయాలు

పార్వతీపురం పురపాలిక గ్రేడ్‌ 1గా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంగానూ మారింది. కానీ పట్టణంలో 30 వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచి దుర్గంధంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని పలువురు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు.

Published : 09 Aug 2022 05:36 IST

నివాసాల మధ్య మురుగు నిల్వ ఉన్న ఈ ప్రాంతం పార్వతీపురం పట్టణంలోని రామానంద్‌నగర్‌ శివారులోని బైపాసు కాలనీ వెనక భాగం. వందల కుటుంబాలున్న ఈ ప్రాంతంలో ఖాళీ స్థలంలో వాడుక నీరు నిలుస్తోంది. ఏడాది పొడుగునా ఇదే పరిస్థితి ఉండటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. దుర్గంధంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయని వాపోతున్నారు.  

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: పార్వతీపురం పురపాలిక గ్రేడ్‌ 1గా కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంగానూ మారింది. కానీ పట్టణంలో 30 వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలతో ఎక్కడికక్కడ నీరు నిలిచి దుర్గంధంతో పాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయని పలువురు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయని చెబుతున్నారు.
ముఖ్యంగా ఇక్కడ..  
పురలో సుమారు 60 వేల మంది జనాభా నివశిస్తున్నారు. ప్రతి వీధిలోనూ ఖాళీ స్థలలు ఉండటం, ఇక్కడ నీరు నిలుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సౌందర్యకాలనీ, జగన్నాథపురం, కొత్తవలస, ఎస్‌ఎన్‌పీ, బంగారమ్మ కాలనీలు, సాయినగర్‌, బైపాస్‌ కాలనీ, చర్చివీధి, నెల్లిచెరువు గట్టు దిగువ భాగం, ఇందిరాకాలనీ, పార్వతీనగర్‌ తదితర చోట్ల ఎక్కువగా ఖాళీ ప్రాంతాలను అధికారులు గుర్తించారు. వీటిని ఏళ్ల కింద కొనుగోలు చేసి ఖాళీగా వదిలేయడంతో లోతట్టుగా నిలిచి నీరు నిలుస్తోంది. ఇక్కడ పలువురికి నోటీసులు అందజేశారు. కానీ వాటిని శుభ్రం చేయించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కొన్ని చోట్ల తుప్పలు, పనికిరాని మొక్కలు నిలిచి అధ్వానంగా తయారవుతున్నాయి.
ఖజానాకు గండి..: ఖాళీ స్థలాలకు పన్ను విధించే అవకాశం ఉన్నా పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. దీంతో పురపాలిక ఏటా రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతోంది. స్థల యజమానులను గుర్తించి పన్ను వసూలు చేయడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాకుండా పరిసరాలు అధ్వానంగా ఉండటంతో పలు ప్రాంతాల్లో రోగాలు విజృంభిస్తున్నాయని, కాలానుగుణ వ్యాధుల బారిన పడుతున్నామని పలువురు చెబుతున్నారు.  

* చర్యలు తీసుకుంటాం..: స్వచ్ఛ పరిరక్షణలో భాగంగా ఖాళీ స్థలాలను అభివృద్ధి చేయాలని ఆయా యజమానులకు సూచించాం. సుమారు 85 మందికి నోటీసులు జారీ చేశాం. సౌందర్య థియేటర్‌ వెనుక ఎక్కువ స్థలాలు గుర్తించాం. స్పందించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దోమల నివారణ చర్యల్లో భాగంగా ద్రావణం పిచికారీ చేస్తున్నాం. - ఆనంద్‌, పుర కమిషనరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని