logo

ఇంటి గడపలే పాఠశాల గదులు

సాలూరు మండలంలోని మరిపల్లి పంచాయతీ గంగన్నదొరవలస గ్రామంలో పాఠశాల పరిస్థితి ఇది. ఇక్కడ గదులు శిథిలావస్థకు చేరడంతో నాడు- నేడులో ఎంపిక చేశారు. నెల రోజుల క్రితం భవనాలను తొలగించారు.

Published : 26 Sep 2022 03:11 IST

వేర్వేరు ఇళ్ల ఆవరణల్లో తరగతుల నిర్వహణ

సాలూరు మండలంలోని మరిపల్లి పంచాయతీ గంగన్నదొరవలస గ్రామంలో పాఠశాల పరిస్థితి ఇది. ఇక్కడ గదులు శిథిలావస్థకు చేరడంతో నాడు- నేడులో ఎంపిక చేశారు. నెల రోజుల క్రితం భవనాలను తొలగించారు. ముందుగా ప్రహరీని నిర్మించారు. త్వరలో భవనాల నిర్మాణం ప్రారంభించనున్నారు. ఈ లోపు విద్యార్థులు ఎక్కడ ఉండాలన్నదే ప్రశ్నార్థకంగా మారింది. గ్రామంలో అద్దెకు ఇల్లు తీసుకోవాలన్నా అందుబాటులో లేకపోవడంతో ఒకటి రెండు తరగతులను ఓ ఇంటి గడపలో, 3, 4, 5 తరగతులను మరో ఇంటి గడపలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న భోజనాలను మరో వీధిలో ఉన్న నిర్వాహకురాలి ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. దీనిపై ఎంఈవో మల్లేశ్వరరావు వివరణ కోరగా.. ప్రస్తుతానికి అద్దె ఇల్లు లేక ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనువైన భవనాలు దొరికితే మారుస్తామన్నారు.   - న్యూస్‌టుడే, సాలూరు గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని