logo

కషాయాల వినియోగంతో అధిక దిగుబడులు

పంటల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు అందుబాటులో

Updated : 26 Sep 2022 16:51 IST

బలిజిపేట: పంటల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు అందుబాటులో ఉన్న కషాయాలను తయారు చేసి వినియోగించాలని మండల వ్యవసాయాధికారి ఎం.శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. మిర్తివలస గ్రామ రైతు భరోసా కేంద్రంలో సామూహిక కషాయాలు, ద్రావణాల తయారీపై ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంలో జిల్లేడు ద్రావణం, ఇంగువ ద్రావణం, అగ్ని అస్త్రం తదితర రసాయనాలను తయారుచేసి పొలంలో చల్లితే తెగుళ్లు, పురుగులను నివారించవచ్చన్నారు. ఈ విధానంపై రైతులకు ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని