logo

పాలకొండ నిండుగా..కోటదుర్గమ్మ పండగ

శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన మంగళవారం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానంలో సామూహిక సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం జరిగిన కుంకుమ పూజల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.

Published : 05 Oct 2022 03:34 IST

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

పాలకొండ, గ్రామీణం, న్యూస్‌టుడే: శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన మంగళవారం పాలకొండ కోటదుర్గమ్మ దేవస్థానంలో సామూహిక సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం జరిగిన కుంకుమ పూజల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. సాయంత్రం జోరు వానలోనూ ప్రధాన వీధుల్లో ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. వడమకాలనీ నుంచి ఆలయం వరకు కొనసాగిన యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నేడు శోభాయాత్ర
బుధవారం కోటదుర్గమ్మ శోభాయాత్ర జరగనుంది. అమ్మవారి కలశాన్ని పట్టణ వీధుల్లో ఊరేగించనున్నారు. ఆలయం నుంచి ప్రధాన రహదారి, యాతవీధి కూడలి మీదుగా భక్తులు తరలివెళ్లనున్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల రంగులు, జ్యోతులతో ఆహ్వానం పలకనున్నారు. చివరి రోజు కావడంతో ఉత్సవాలను తిలకించేందుకు పెద్దఎత్తున జనం రానున్నారు. ఈ మేరకు దేవదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. పది రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విరామంగా సాగనున్నాయి. డీఎస్పీ ఎం.శ్రావణి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తుకు సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని