logo

ఉద్యోగుల కృషితో జాతీయ గుర్తింపు

జిల్లా ఆవిర్భవించిన ఆరు నెలల వ్యవధిలోనే జాతీయ స్థాయి గుర్తింపు రావడం వెనుక ఉద్యోగుల పాత్ర ఉందని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాకు ఆయుష్మాన్‌ ఉత్కృష్ట పురస్కారం, సాలూరుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు వచ్చిన నేపథ్యంలో

Published : 05 Oct 2022 03:34 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లా ఆవిర్భవించిన ఆరు నెలల వ్యవధిలోనే జాతీయ స్థాయి గుర్తింపు రావడం వెనుక ఉద్యోగుల పాత్ర ఉందని కలెక్టరు నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాకు ఆయుష్మాన్‌ ఉత్కృష్ట పురస్కారం, సాలూరుకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు వచ్చిన నేపథ్యంలో కలెక్టరును ఉద్యోగులు అభినందించారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదామని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. మన్యంలో మలేరియా, డెంగీ నివారణకు అన్ని గ్రామాల్లో ద్రావణం పిచికారీ చేశామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పారు. జీవన ప్రమాణాలు, అక్షరాస్యత పెంపు, మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా పని చేయాలన్నారు. సబ్‌ కలెక్టరు భావన, డీఆర్వో వెంకటరావు, ఆర్డీవో హేమలత, అధికారులు పాల్గొన్నారు.  


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts