logo

అదుపు తప్పితే.. ప్రవాహంలోకే!

జియ్యమ్మవలస మండలంలోని రావాడ వద్ద వట్టిగెడ్డ దిగువన ఉన్న కాజ్‌వే పైనుంచి వరద ప్రవహించడంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 05 Oct 2022 03:34 IST

జియ్యమ్మవలస మండలంలోని రావాడ వద్ద వట్టిగెడ్డ దిగువన ఉన్న కాజ్‌వే పైనుంచి వరద ప్రవహించడంతో పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వట్టిగెడ్డకు వరద రావడంతో స్పిల్‌ వే వద్ద మంగళవారం ఒక షట్టరు ఎత్తి 200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో సమస్య ఏర్పడి టీకేజమ్ము, అలమండ, పీటీమండ, కొండచిలకాం పంచాయతీల ప్రజలు ప్రయాణానికి అవస్థలు పడ్డారు.

- న్యూస్‌టుడే, జియ్యమ్మవలస


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts