logo

ఎనిమిది కాళ్లతో మేక జననం

మక్కువ మండలంలోని కోన గ్రామంలో మంగళవారం ఉదయం ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులతో మేక పిల్ల పుట్టింది. కొంతసేపటికే అది మృతి చెందినట్లు యజమాని జాన సన్యాసినాయుడు తెలిపారు.

Published : 05 Oct 2022 03:34 IST

మక్కువ, న్యూస్‌టుడే: మక్కువ మండలంలోని కోన గ్రామంలో మంగళవారం ఉదయం ఎనిమిది కాళ్లు, నాలుగు చెవులతో మేక పిల్ల పుట్టింది. కొంతసేపటికే అది మృతి చెందినట్లు యజమాని జాన సన్యాసినాయుడు తెలిపారు. మేకను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. దీనిపై గరివిడిలోని పశువైద్య కళాశాల సహాయ ఆచార్యుడు గంగునాయుడు మాట్లాడుతూ.. జన్యువుల అమరికలో లోపాలు, రెండు పిండాలు ఒకే వ్యవస్థగా ఏర్పడటం తదితర కారణాలతో ఇలా జరుగుతుందన్నారు. లక్షలో రెండు ఇలా జన్మిస్తాయని, బతికినా ఎక్కువ కాలం ఉండలేవని ఆయన తెలిపారు.


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts