logo

ఉద్యోగోన్నతులు గురూ..!

ప్రభుత్వ, జడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ, పాఠశాల సహాయకుల ఉద్యోగోన్నతులకు  ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. సీనియార్టీ జాబితాల విడుదల, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. ఈ నెల ఏడో తేదీన ప్రొవిజినల్‌ సీనియార్టీ జాబితా విడుదల చేస్తుంది.

Published : 05 Oct 2022 03:43 IST

ఉమ్మడి జిల్లాలో 132 మందికి అవకాశం

హేతుబద్ధీకరణతో తగ్గిన అవకాశాలు

ధ్రువపత్రాల పరిశీలన (పాత చిత్రం)

విజయనగరం విద్యా విభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ, జడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎస్జీటీ, పాఠశాల సహాయకుల ఉద్యోగోన్నతులకు  ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. సీనియార్టీ జాబితాల విడుదల, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. ఈ నెల ఏడో తేదీన ప్రొవిజినల్‌ సీనియార్టీ జాబితా విడుదల చేస్తుంది. అభ్యంతరాల స్వీకరణ తర్వాత పదో తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారు. 11, 12 తేదీల్లో ఉద్యోగోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు ఉపాధ్యాయులకు ఇస్తారు. ఈ నెల 13 వరకూ దీన్ని కొనసాగిస్తారు. విద్యాశాఖ ఇప్పటికే ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాలను ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 26, 27 తేదీల్లో ధ్రువపత్రాల్ని పరిశీలించారు. హేతుబద్ధీకరణ వల్ల ఉమ్మడి జిల్లాలో 132 మందికి ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ గణాంకాల బట్టి తెలుస్తోంది.

ఇదీ పరిస్థితి: పాఠశాల సహాయకులు(హిందీ)లో కొరత ఉన్న 25 పోస్టుల్లో 70 శాతం కోటా కింద 15 మందికే ఉద్యోగోన్నతి లభించనుంది. ఎస్జీటీలో హిందీ చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు. బీ పీడీ పోస్టుల్లో పీఈటీ (వ్యాయామ ఉపాధ్యాయులు)లకు ఉద్యోగోన్నతి కల్పిస్తారు. ఎస్జీటీల్లో బీపీఈడీ చేసిన వారికి పీడీగా అవకాశం ఇవ్వాలనుకున్నా...అభ్యర్థులు లేకపోవడంతో 72 పోస్టులు ఖాళీగానే ఉండిపోనున్నాయి.


6న పరిశీలన
పాఠశాల సహాయకుల హిందీకి అర్హులైన వారికి ఉద్యోగోన్నతిని కల్పించనున్నాం. ఈ నెల 6న డీఈవో కార్యాలయంలో అర్హుల ధ్రువపత్రాలను పరిశీలిస్తాం. ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చాం.
- కె.వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి డీఈవో


ఉపాధ్యాయుల కొరతతో...: హేతుబద్ధీకరణతో కొన్ని కేడర్లలో ఉపాధ్యాయుల కొరత ఉండడంతో వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టారు. మిగులు పోస్టుల్ని సర్దుబాటు చేయగా తొలుత గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకుల ఆంగ్లం, పీడీ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. తాజాగా పాఠశాల సహాయకుల హిందీ సబ్జెక్టులోనూ ఉద్యోగోన్నతులు కల్పించాలని ఆదేశాలు రావడంతో సీనియార్టీ జాబితా ప్రకారం ఉపాధ్యాయుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు