logo

ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలి: తెదేపా

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి డిమాండు చేశారు. పార్టీ మెంటాడ మండలాధ్యక్షుడు చలుమూరి వెంకటరావు ఆధ్వర్యంలో మంగళవారం మెంటాడ మండల కేంద్రంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొని, మాట్లాడారు.

Published : 05 Oct 2022 04:18 IST

రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న సంధ్యారాణి

మెంటాడ, న్యూస్‌టుడే: ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరునే కొనసాగించాలని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి డిమాండు చేశారు. పార్టీ మెంటాడ మండలాధ్యక్షుడు చలుమూరి వెంకటరావు ఆధ్వర్యంలో మంగళవారం మెంటాడ మండల కేంద్రంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆమె పాల్గొని, మాట్లాడారు. తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన మహనీయుడి పేరు తొలగింపు అన్యాయమన్నారు. వెంటనే దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. నాయకులు గెద్ద అన్నవరం, గొర్లె ముసలినాయుడు, రెడ్డి ఎర్రినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని