logo

ఇళ్లెందుకు కట్టలేరు?

‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జగనన్న కాలనీల్లోని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 960 లేఅవుట్లు ఉండగా..  చాలా చోట్ల అవి లేక గృహాలు     నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

Updated : 27 Nov 2022 02:38 IST

సౌకర్యాలు ఉండాలి కదండీ  

‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జగనన్న కాలనీల్లోని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 960 లేఅవుట్లు ఉండగా..  చాలా చోట్ల అవి లేక గృహాలు     నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.

ఎస్‌.కోట మండలం వెంకటరమణపేట    లేఅవుట్‌లో 58 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు.   సింగిల్‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, ఆరు విద్యుత్తు స్తంభాలు వేశారు. ఆ తర్వాత ఎటువంటి పనులు చేపట్టలేదు.


విజయనగరం అర్బన్‌, ఎస్‌.కోట, పార్వతీపురం పురపాలిక, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ న్యూస్‌టుడే

రెండు జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.17.65 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. పార్వతీపురం మన్యంలో రూ.6.83 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.10.82 కోట్లు మంజూరు చేశారు. తాగునీరు, అప్రోచ్‌ రోడ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్తు లైన్ల మార్పిడి, గోదాముల నిర్మాణం, స్థలాల చదును తదితర వాటిని ఈ నిధులతో చేపట్టాల్సి ఉంది. తాగునీటి పనుల్లో కొంత పురోగతి కనిపిస్తున్నా, ఇతర వాటిలో అంతంతమాత్రమే. విజయనగరం జిల్లాలో 962 తాగునీటి పనులకు గానూ 912 పూర్తయ్యాయి. 436 పనులకే విద్యుత్తు సౌకర్యం కల్పించారు. పార్వతీపురం మన్యంలో 328 తాగునీటి పనులకు గానూ 216 పూర్తి కాగా, 63 పనులకు మాత్రమే విద్యుత్తు సౌకర్యం కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.


కొమరాడ మండలం మాదలింగి కాలనీలో 15 ఇళ్లు మంజూరు చేశారు. రెండు విద్యుత్తు స్తంభాలు వేసినా కరెంట్‌ ఇవ్వలేదు. భూమిని చదును   చేసి రోడ్డు వేసినా వదిలేయడంతో ఇలా మారిపోయింది.


వేగవంతం చేయాలని ఆదేశించాం  

పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నాం. అయితే వర్షాల వల్ల నిలిచిపోయాయి. మంజూరు చేసినవి వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ఆదేశించాం. వాటిని పర్యవేక్షిస్తాం.

- ఎస్‌.వి.రమణమూర్తి, రఘురాం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులు


ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశానికి తెలియజేసిన సమాచారం ఆధారంగా వివరాలిలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని