logo

పౌరుల హక్కులకు వైకాపా తూట్లు

రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కులకు వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, దాని నుంచి ప్రజలను, రాజ్యాంగాన్ని రక్షించాలని అంబేడ్కర్‌ విగ్రహానికి తెదేపా నాయకులు వినతిపత్రం అందజేశారు.

Published : 27 Nov 2022 02:21 IST

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న సంధ్యారాణి, భంజ్‌దేవ్‌, నాయకులు

సాలూరు, న్యూస్‌టుడే: రాజ్యాంగంలో పౌరులకు కల్పించిన హక్కులకు వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, దాని నుంచి ప్రజలను, రాజ్యాంగాన్ని రక్షించాలని అంబేడ్కర్‌ విగ్రహానికి తెదేపా నాయకులు వినతిపత్రం అందజేశారు. పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సంధ్యారాణి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో నాయకులు సాలూరు పట్టణంలోని పెదహరిజనపేటలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు నిమ్మాది చిట్టి, గుళ్ల వేణు, నాయకులు పి.ప్రసాద్‌బాబు, పరమేశు, రమణ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని