logo

ఉత్సాహంగా కౌశల్‌ పోటీలు

విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను పోటీలు వెలికితీస్తాయని ఉప విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు అన్నారు.

Published : 27 Nov 2022 02:21 IST

ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీరావు, అధికారులు

పార్వతీపురం పట్టణం, సీతానగరం, న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగి ఉన్న సామర్థ్యాలను పోటీలు వెలికితీస్తాయని ఉప విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు అన్నారు. సీతానగరం మండలం మరిపివలస పాలిటెక్నిక్‌ కళాశాలలో జిల్లాస్థాయి కౌశల్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించారు. 15 మండలాల నుంచి 36 బృందాలు హాజరై నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీపడ్డారు. కురుపాం జడ్పీ పాఠశాల విద్యార్థులు వి.శశికిరణ్‌, అనూష, కె.లక్ష్య ప్రథమ,  పార్వతీపురం కేపీఎం పాఠశాల విద్యార్థులు జి.ఉమేష్‌నాయుడు, జె.గాయత్రి, జి.భావన ద్వితీయ,  చినమేరంగి జడ్పీ పాఠశాల విద్యార్థులు కె.ఢిల్లీశ్వరరావు, డి.ముఖేశ్వరి, బి.త్రివేణి తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి నగదు బహుమతులు అందజేశారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్తారని కౌశల్‌ జిల్లా సమన్వయకర్త పి.రామకృష్ణ తెలిపారు.


పోస్టరు ప్రదర్శనలో

జిల్లాస్థాయి పోస్టరు ప్రదర్శనలో భాగంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌, జలసంరక్షణ, జీవ వైవిధ్యం అంశాలపై విద్యార్థులు చిత్రాలు ప్రదర్శించారు. ఎస్‌.మనస్విని, ఎ.దివ్య, ఎ.హాసిని  తొలి మూడు స్థానాల్లో నిలిచారు. జిల్లా ఆప్కాస్ట్‌ అకడమిక్‌ సమన్వయకర్త కె.అయ్యప్ప, జిల్లా సైన్సు అధికారి జి.లక్ష్మణరావు పాల్గొన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని