logo

కుమరాంలో మరో చోరీ

మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్‌లో శుక్రవారం చోరీ ఘటన మరవక ముందే మరొకటి వెలుగు చూసింది.

Updated : 27 Nov 2022 06:27 IST

ఇంట్లో  పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు

జామి, న్యూస్‌టుడే: మండలంలోని కుమరాం పంచాయతీ కల్యాణ నగర్‌లో శుక్రవారం చోరీ ఘటన మరవక ముందే మరొకటి వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన వర్రి అప్పాజీ స్వామి అయ్యప్ప దీక్షతో శబరిమల వెళ్లి శనివారం మధ్యాహ్నం తిరిగి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు తీసి ఉండటం, దుస్తులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని పోలీసు స్టేషన్‌కు సమాచారమిచ్చారు. ఎస్‌ఐ వీరబాబు వెళ్లి వివరాలు సేకరించారు. క్లూటీం పరిశీలనలో వెండి వస్తువులు దొరికాయి. మొత్తం ఆరు తులాల బంగారం, రూ.50 వేల నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు అప్పాజీ ఫిర్యాదు చేశారు.

తేలిన లెక్క: ఇదే గ్రామంలో పిన్నింటి ప్రసాదరావు ఇంట్లో చోరీకి గురైంది 22 తులాల బంగారం, 60 తులాల వెండిగా లెక్క తేలింది. ఇంటికి చేరుకున్న బాధితుడు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డీఎస్పీ పరిశీలన.. కుమరాంలో చోరీలు జరిగిన రెండు ఇళ్లను విజయనగరం డీఎస్పీ శ్రీనివాసరావు శనివారం రాత్రి పరిశీలించారు. ప్రసాదరావు ఇంట్లో చోరీ జరిగిన తీరును గమనించారు. మరో బాధితుడు అప్పాజీ ఇంటిని సందర్శించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని, దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని