logo

మిగులు ధాన్యం కొనుగోలుకు చర్యలు

ఖరీఫ్‌లో పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా రైతుల వద్ద ఉన్న పంట వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు.

Published : 25 Jan 2023 02:50 IST

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టరు నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఖరీఫ్‌లో పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిలో భాగంగా రైతుల వద్ద ఉన్న పంట వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు జిల్లాలో 6,500 టన్నుల ధాన్యం యాప్‌లో నమోదైనట్లు చెప్పారు. దీంతో పాటు ఈ క్రాప్‌లో నమోదై కొనుగోలుకు నోచుకోని పంట వివరాలు సేకరించాలన్నారు. ఈ ప్రక్రియలో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. రబీకి సంబంధించి ఈకేవైసీ, పీఎం కిసాన్‌ సమాచారం నమోదులో వెనుకబడి ఉన్న మండలాల అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్‌పాల్‌ను ఆదేశించారు. బిందు సేద్యం పథకంలో వాటా ధనం చెల్లించిన రైతులకు యూనిట్లు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన, పశు సంవర్ధక, మత్స్య, బిందు, సూక్ష్మసేద్యం జిల్లా అధికారులు సత్యనారాయణరెడ్డి, ఈశ్వరరావు, తిరుపతయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని