logo

ప్రమాదంలోకి నెట్టేసి.. వెళ్లిపోయారు

పార్వతీపురం మండలంలోని ఎల్‌ఎన్‌పురం ప్రాథమిక పాఠశాలకు అదనపు భవనం మంజూరైంది. పిల్లర్ల నిర్మాణానికి పాత భవనం ముందు రెండు నెలల క్రితం గోతులు తీసి.. అలా వదిలేశారు.

Published : 26 Jan 2023 01:48 IST


భవనం పక్కనే ప్రమాదకరంగా భారీ గుంత..

న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం :  పార్వతీపురం మండలంలోని ఎల్‌ఎన్‌పురం ప్రాథమిక పాఠశాలకు అదనపు భవనం మంజూరైంది. పిల్లర్ల నిర్మాణానికి పాత భవనం ముందు రెండు నెలల క్రితం గోతులు తీసి.. అలా వదిలేశారు. దీంతో విద్యార్థులు గోతుల్లో పడే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. పనులకు కావాల్సిన ఇనుము, రాయి, ఇసుక సిద్ధంగా ఉన్నా.. చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదాలు జరగక ముందే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపై ఏఈ శ్రీకర్‌ను వివరణ కోరగా.. త్వరలో పనులు  ప్రారంభవుతాయని, ప్రమాదం జరగకుండా చూడాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించామన్నారు. 

పునాది పిల్లర్లకు కట్టిన ఇనుప చువ్వలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని